నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ 716 కోట్లు : ఆమోదించిన కౌన్సిల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ రూపొందించామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సర్వ సభ్య బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని ఎ.పి.జె అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన 2022-23 ఆర్ధిక సంవత్సరం యొక్క సవరించిన బడ్జెట్ అంచనాలు రూ.507,56,85,545/- లు మరియు 2023-24 బడ్జెట్ అంచనాలు రూ.716,49,03,000/- ల ఆమోదం కొరకు సమావేశం నిర్వహించారు. 2023-24 వార్షిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు రూ.716,49,03,000/- లకు కౌన్సిల్ వారిచే ఆమోదించడము జరిగినది. నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ ను కేటాయించడం జరిగిందని మేయర్ తెలిపారు. అనంతరం ప్రజా ప్రతినిధులు ప్రస్తావించిన వివిధ స్థానిక సమస్యలను, అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని మేయర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇంచార్జ్ కమిషనర్ చెన్నుడు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Read Previous

గురువు గారూ… వైసీపి ట్రాప్ లో పడొద్దు : ఉండవల్లికి ఎమ్మెల్యే కోటంరెడ్డి విజ్ఞాపన

Read Next

బడ్జెట్ సమావేశం ప్రశాంతం : వన్ ఉమెన్ షోగా వ్యవహరించిన మేయర్ స్రవంతి

Leave a Reply

Your email address will not be published.