Clock Of Nellore ( Nellore ) – నమ్మకానికి, విలువలకు, విశ్వసనీయతకు మారుపేరయిన మార్గదర్శి చిట్స్ ఫండ్స్ పై ప్రభుత్వ వేధింపులు ఇకనైనా ఆపాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. మార్గదర్శిలో నిజంగా అక్రమాలు జరిగి ఉంటే ఆధారాలను కోర్టుకు సమర్పించి, కోర్టు సూచనల మేరకు ముందుకు వెళ్లాలని వెల్లడించారు. జర్నలిజంలో విలువల పాటిస్తూ పాత్రికేయ రంగానికే మార్గదర్శి అయిన రామోజీరావుపై ఏపి సిఐడి ఇంత దారుణంగా వ్యవహరించడం మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి ఆదేశాలు లేనిదే సిఐడి అధికారులు ఈ విధంగా ప్రవర్తించరని కోటంరెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్త అదాని కంపెనీలకు సంభందించి ఒక్క వార్త బయటకు వస్తేనే ఆ కంపెనీ షేర్లు భారీ పడిపోయాయని, ఇన్వెన్టర్లు ఆందోళనకు గురౌనారని, అయితే మార్గదర్శిపై ఇన్ని వేధింపులు చేస్తున్నా ఒక్క డిపాజిట్ దారుడు కూడా తమ డబ్బు తిరిగి ఇవ్వాలని మార్గదర్శి వైపు వెళ్లలేదంటేనే తెలియడం లేదా అని ప్రశ్నించారు. నమ్మకానికి, విలువలకు, విశ్వసనీయతకు మార్గదర్శి మారుపేరన్న విషయం డిపాజిట్ దార్లకు తెలుసునని పేర్కొన్నారు. రాజకీయ కక్షల నేపద్యంలో పత్రికల యాజమాన్యాలను ఇబ్బందులుకు గురిచేయడం ఏం పద్దతి అని అడిగారు. ఆంధ్రజ్యోతి దిన పత్రిక, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కు ప్రభుత్వం నుండి ప్రకటనలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిఐడి అధికారులకు న్యాయంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇవ్వాలన్నారు. పద్మ విభూషణ్ బిరుదును అందుకున్న రామోజీరావుపై జరుగుతున్న వేధింపుల పర్వంపై ప్రధాని నరేంద్ర మోడీ కలుగజేసుకోవాలని కేంద్రాన్ని కోరారు.