ఎమ్మెల్యే మేకపాటికి మరో సారి అస్వస్థత : చెన్నైకు తరలింపు

Clock Of Nellore ( Udayagiri ) – ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం అస్వస్థతకు గురైనారు. రెండు రోజుల నుండి జరుగుతున్న రాజకీయ సవాళ్ల నేపద్యంలో ఇవాళ ఉదయం ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు చంద్రశేఖర్ రెడ్డి బయలుదేరి వెళ్తుండగా మరో మారు స్వల్పంగా గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. హుటాహుటిన మర్రిపాడుకు చేరుకున్న వైద్యులు ఆయనకు ఇంట్లోనే చికిత్స అందించారు. వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను చెన్నైకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఓ దఫా ఇదే మాదిరిగా గుండెపోటుకు గురికాగా ఆయన బెంగుళూరులో స్టంట్ వేయించుకుని ఉన్నారు. ఆ తర్వాత మరోసారి గుండె నొప్పి రాగా చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. ఇటీవల జరిగన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ పాల్పడ్డరన్న ఆరోపణలతో వైసీపి నుండి ఆయన్ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఉదయగిరిలో వైసీపి నేతలు చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన దిష్ఠిబొమ్మను కూడా దహనం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గురువారం సాయంత్రం ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు వెళ్లి నడిరోడ్లో కుర్చి వేసుకుని కూర్చొని ఎవరొస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. ఈ నేపద్యంలో శుక్రవారం కూడా మరోసారి ఆ సెంటర్ కు వెళ్లేందుకు మర్రిపాడులోని ఇంటి నుండి బయలుదేరి వెళ్తుండగా అస్వస్థతకు గురైనారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చెన్నైకు తీసుకెళ్లేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Read Previous

నెల్లూరు సిటీ నుండి నారాయణ పోటీ : స్పష్టం చేసిన చంద్రబాబు

Read Next

ప్రభుత్వ స్థలాలను ఎలా ఆక్రమిస్తారు ? – కొత్తూరు భూములపై ఎమ్మెల్యే అనీల్ స్పందన

Leave a Reply

Your email address will not be published.