Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు గురువారం నెల్లూరులో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ లో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి సంబరాలు జరిపారు. భారీ కేక్ ను కట్ చేసి అనీల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నర్తకి సెంటర్ లో కూడా అనీల్ కుమార్ యాదవ్ పుట్టిన రోజు సంబరాలు వైభవంగా జరిగాయి. వైసీపి నేతలు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరో వైపు నటుడు అలీ… అనీల్ కుమార్ యాదవ్ కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరో వైపు అమరావతిలో ఉన్న ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్… అనీల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

