Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో మూడు రోజుల పాటూ జరిగే జర్నలిస్టుల క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గురువారం ప్రారంభించారు. జర్నలిస్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయనతో పాటూ నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాసేపు క్రికెట్ ఆడారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తల సేకరణలో నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టుల కోసం క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. ఈ పోటీలకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల నుండి 10 టీములు హాజరయ్యాయి. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ పాల్గొన్నారు.
