విద్యార్ధులకు రాగి జావ : నెల్లూరులో పథకాన్ని ప్రారంభించిన జడ్పీ ఛైర్ పర్సన్ అరుణమ్మ

Clock Of Nellore ( Nellore ) – జగనన్న గోరుముద్ద పధకంలో భాగంగా విద్యార్ధులకు రాగి జావ అందించడం ద్వారా విద్యార్ధుల్లో పోషకాహార లోపం మరియు రక్త హీనత లోపాన్ని నివారించడానికి ఎంతో దోహదపడుతుందని, జిల్లాలోని 2,590 పాఠశాలల్లో 1,81,327 మంది విద్యార్ధులకు రాగి జావ అందనుందని జిల్లా పరిషత్ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన రాగి జావ అందించే కార్యక్రమంలో ఆమె జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డితో కలిసి నెల్లూరు తిక్కన ప్రాంగణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి విద్యార్ధులకు రాగి జావ అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమ రంగాలను ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని విద్యా రంగంలో ఎన్నడూ లేనివిధంగా అనేక మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. అందులో భాగంగా నాడు – నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి గంగా భవాని, సమగ్ర శిక్ష ఆడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఉషారాణి, ఇస్కాన్ ట్రస్ట్ ప్రతినిధులు స్వామి చంద్రకేశవ దాస్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

రంజాన్ మాసం ఏర్పాట్లపై మేయర్ స్రవంతి అధికారులతో సమీక్ష

Read Next

నెల్లూరులో ముగ్గురు సిఐల బదిలీ : ఆదేశాలిచ్చిన ఎస్పీ విజయరావు

Leave a Reply

Your email address will not be published.