Clock Of Nellore ( Nellore ) – ఎముకలు బలంగా ఉన్నాయా లేదా అని పరీక్షించే DEXA స్కానింగ్ మిషన్ నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుండి ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హాస్పిటల్ సిఈఓ నవీన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాం సతీష్ సోమవారం తెలియజేశారు. ఈ DEXA స్కానింగ్ మిషన్ ద్వారా ఎముకలు బలంగా ఉన్నాయా లేదా బలహీనంగా ఉన్నాయా అనే విషయాన్ని పూర్తి ఖచ్చితత్వంతో తెలుసుకోవచ్చునని తెలిపారు. అంతే కాకుండా ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్, మినరల్స్, కొవ్వు శాతం తగిన మోతాదులో ఉందో లేదో కూడా గుర్తించవచ్చునని వారు వివరించారు. ఈ స్కానింగ్ ద్వారా ఎముకల బలహీనను, తద్వారా వచ్చే సమస్యలను తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. మహిళల్లో మెనోపాజ్ దశకు చేరుకున్న వారు, ఎక్కువ మోతాదులో మద్యం తీసుకునే వాళ్లు, VITO D లోపం ఉన్న వారు, స్టెరాయిడ్స్ ఎక్కువ రోజులు తీసుకున్న వాళ్లకి, Arthritis సమస్య ఉన్న వాళ్లు ఈ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. అతి తక్కువ ఖర్చుతో చేసే ఈ పరీక్షను నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ హెడ్ బాలరాజు, హెచ్ ఓడి డాక్టర్ గాయత్రి, డాక్టర్ ప్రమేష్, డాక్టర్ షబానా, డాక్టర్ అర్షియా పాల్గొన్నారు.
