శరవేగంగా సాగుతున్న నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ప్రధాన రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ స్టేషన్ ను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులను కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న రైల్వే స్టేషన్ కట్టడాలన్నీ కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మాణం కానున్నాయి. తూర్పు టెర్మినల్ వైపు ఇప్పటికే నూతన భవనాల నిర్మాణం కొనసాగుతుండగా, పశ్చిమ టెర్మినల్ వైపు భవన నిర్మాణాలను తాజాగా ప్రారంభించారు. పునాదుల పనులు మొదలయ్యాయి. అత్యంత ఆధునికంగా రెండు టెర్మినళ్లు నిర్మాణం కానున్నాయి. భవిష్యత్తులో పెరిగే ప్రయాణీకుల సంఖ్యను దృష్ఠిలో ఉంచుకుని దీన్ని నిర్మిస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిధి కూడా పెరగనుంది. ఫ్లాట్ ఫాంలు కూడా అందంగా రూపుదిద్దుకోనున్నాయి. 2024 మే నెల కల్లా ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

 

Read Previous

10వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

Read Next

సమస్యలపై అమరావతిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన గళం

Leave a Reply

Your email address will not be published.