పదవికి రాజీనామా చేసిన వవ్వేరు కో – ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మైన్ సూరా

Clock Of Nellore ( Buchireddy Palem ) – నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డి పాళెంలోని వవ్వేరు కో – ఆపరేటివ్ రూరల్ బ్యాంకు ఛైర్మైన్ సూరా శ్రీనివాసులు రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మరో 10 రోజుల్లో పదవీ కాలం ముగియనున్న నేపద్యంలో మంగళవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి బ్యాంకు ఛైర్మైన్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన పదవీ కాలంలో తనకు సహకరించి అధికారులకు, ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన 10 ఏళ్ల పదవీ కాలంలో బ్యాంకు అభివృద్ధికి విశేషంగా కృషి చేశానని వెల్లడించారు. అదలా ఉండగా ఆయన్ను ఛైర్మైన్ పదవి నుండి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నందునే ముందుగానే రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. బ్యాంకు సంభందించిన నగదును తన స్వంతానికి వాడుకున్నట్లు గతంలో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలపై సహకార శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా ఆయన సహకార శాఖ నుండి నోటీసులు కూడా అందుకున్నారు. విచారణ కీలక దశకు చేరుకున్న నేపద్యంలో అనూహ్యంగా సూరా శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. సూరా శ్రీనివాసులు రెడ్డి… కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడు.

Read Previous

గిరిజన సర్పంచ్ కు కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వరా ? – ప్రశ్నించిన పెంచలయ్య

Read Next

ఉగాది నాటికి జగనన్న గృహాలు పూర్తి : వెల్లడించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Leave a Reply

Your email address will not be published.