Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 7వ తేదీన నెల్లూరుకు విచ్చేస్తున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఈనెల 7న సాయంత్రం నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి విచ్చేయుచున్న సందర్భంగా సోమవారం సాయంత్రం ముందస్తు భద్రత సమన్వయం (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజాన్- ఏ ఎస్ ఎల్) ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ విజయ రావుతో కలిసి పరిశీలించారు. కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన హెలీపాడ్ వద్ద చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లు, కాన్వాయ్ రాకపోకలు, పార్కింగ్, విఐపిల అనుమతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ ను పరిశీలించారు. వీరి వెంట నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత, సంయుక్త కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, అదనపు ఎస్పీ హిమావతి, ఐఎస్ డబ్ల్యు డిఎస్పి కెవివిఎస్ ప్రసాద్, రూరల్ డి.ఎస్.పి వీరాంజనేయరెడ్డి, జడ్పీ సీఈవో చిరంజీవి, నెల్లూరు ఆర్డిఓ మలోల, డిటిసి చందర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి ఎస్ఇలు రంగవర ప్రసాద్, అశోక్ కుమార్, మురళీకృష్ణ, డి సి హెచ్ ఎస్ డా. రమేష్ నాథ్ తదితర జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.