
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీలో అంతర్ కళాశాలల క్రీడా పోటీలు సోమవారం ప్రారంభమైనాయి. ఈ క్రీడా పోటీలను యూనివర్శిటీ వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి ప్రారంభించారు. మొత్తం 20 కళాశాలల నుండి 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. హ్యాండ్ బాల్, సాఫ్ట్ బాల్, టేబుల్ టెన్నిస్, చెస్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, యోగా, తైక్వాండో, కబడ్డీ తదితర క్రీడా పోటీలు ఈ సందర్భంగా ఉత్సాహంగా జరిగాయి. ప్రారంభం సందర్భంగా వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి మాట్లాడుతూ విక్రమ సింహపురి యూనివర్శిటీ క్రీడలకు సంభందించి మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రిన్సిపల్ విజయ ఆనంద్ కుమార్, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ సునీత, ఫిజికల్ డైరెక్టర్లు ప్రవీణ్, రవీంద్రమ్మ, పరిశీలకులు విజయకళ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.