సిబిఐ విచారణను స్వాగతిస్తున్నా : దర్యాప్తులో నిజాలు తెలుస్తాయన్న మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు కోర్టులో దస్త్రాల చోరీ కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తమకు నీతి, నిజాయితీ ఉంది కాబట్టే సిబిఐ విచారణకు కోర్టులో అభ్యంతరం తెలియజేయలేదన్నారు. నెల్లూరులోని వారి నివాసంలో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. సిబిఐ విచారణతో వాస్తవారు వెలుగులోకి వస్తాయని, తాము కోరుకునేది కూడా అదేనని స్పష్టం చేశారు. సిబిఐ విచారణతో తమను విమర్శించే టిడిపి నేతల నోర్లు మూతపడతాయని అన్నారు. చంద్రబాబులా తాము భయపడి పారిపోమని, ఏ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Read Previous

హెల్త్ వర్కర్ కు మేస్త్రీగా పదోన్నతి : ఉత్తర్వులు అందజేసిన కమిషనర్ హరిత

Read Next

సచివాలయ కార్యదర్శులపై కమిషనర్ ఆగ్రహం : ఒక రోజు జీతం కట్

Leave a Reply

Your email address will not be published.