సచివాలయ కార్యదర్శులపై కమిషనర్ ఆగ్రహం : ఒక రోజు జీతం కట్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్, వెంగళ రావు నగర్ సచివాలయ కార్యదర్శుల విధి నిర్వహణ తీరుపై కమిషనర్ హరిత ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయాల సందర్శనలో భాగంగా గురువారం ఆయా సచివాలయాలను తనిఖీ చేసిన కమిషనర్ మధ్యాహ్న సమయంలో సిబ్బంది అందుబాటులో లేనట్లు గుర్తించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల సమయంలో స్పందన అర్జీలు స్వీకరించేందుకు కేటాయించామని, ప్రతి ఒక్క కార్యదర్శి తప్పనిసరిగా కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ధరించని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఒకరోజు జీతం కోత విధించాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం సచివాలయాల్లోని రికార్డులు పరిశీలించి వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.

 

Read Previous

సిబిఐ విచారణను స్వాగతిస్తున్నా : దర్యాప్తులో నిజాలు తెలుస్తాయన్న మంత్రి కాకాణి

Read Next

ఈనెల 26న PSLV – C54 రాకెట్ ప్రయోగం : శుక్రవారం నుండి కౌంట్ డౌన్

Leave a Reply

Your email address will not be published.