ఈనెల 26న PSLV – C54 రాకెట్ ప్రయోగం : శుక్రవారం నుండి కౌంట్ డౌన్

Clock Of Nellore ( Srihari Kota ) – ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈనెల 26న PSLV – C54 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంభందించి ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. శనివారం ఉదయం షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఉదయం 11:56 గంటలకు పిఎస్ఎల్వీ రాకెట్ గగనతలంలోకి ప్రవేశించనుంది. ఈ రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ – 06 ( EOS-06 ) ఉపగ్రహంతో పాటూ మరో 8 చిన్న ఉపగ్రహాలను ఇస్రో భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి సంభందించి శుక్రవారం కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

ఓషియాన్ శాట్ సిరీస్ లో 1117 కిలోల బరువైన EOS-06 ఉపగ్రహం 6వ ది. ఈ ఉపగ్రహంలో ప్రధానంగా నాలుగు పరికరాలను అమర్చారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఓషన్ కలర్ మానిటర్, సీ సర్ ఫేజ్ టెంపరేచర్ మానిటర్, కేయు బ్యాండ్ స్కాట్టరో మీటర్, ARGOS అనే పరికరాలను ఉప గ్రహాలను అమర్చారు. ఇవి పూర్తిగా భూమికి సంభందించి పరిశోధనకు ఉపయోగ పడే అత్యాధునిక పరికరాలు. ఈ ఉపగ్రహమే ప్రధాన ప్రయోగ లక్ష్యం. ఇది కాకుండా మరో 8 చిన్న ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. 18.28 కిలోల బరువైన INS-2B, 16.51 కిలోల బరువైన ఆనంద్ ఉపగ్రహం, 1.45 కిలోల బరువైన THYBOLT అనే రెండు ఉపగ్రహాలు, 17.92 కిలోల బరువైన ఆస్ట్రోకాస్ట్ అనే నాలుగు ఉపగ్రహాలను PSLV – C54 ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ( PSLV ) రాకెట్ ప్రయోగాల్లో ఇది 56వ ప్రయోగం. PSLV – XL వెర్షన్ ప్రయోగాల్లో ఇది 24వ ప్రయోగం.

Read Previous

సచివాలయ కార్యదర్శులపై కమిషనర్ ఆగ్రహం : ఒక రోజు జీతం కట్

Read Next

20 లక్షలతో డ్రైన్లు, రోడ్ల నిర్మాణం : శంఖుస్థాపన చేసిన మేయర్ స్రవంతి

Leave a Reply

Your email address will not be published.