రాపూరులో గల్లంతైన యువకుడు మృత్యువాత : మృతదేహం లభ్యం

Clock Of Nellore ( Rapur ) – తిరుపతి జిల్లా రాపూరు ఘాట్ లోని సిద్దేశ్వర కోన జలపాతంలో శుక్రవారం గల్లంతైన వెంకట కళ్యాణ్ మృత్యువాత పడ్డాడు. గూడూరు వాలనందపురం సొసైటికి ప్రాంతానికి చెందిన వెంకట కళ్యాణ్ శుక్రవారం తన స్నేహితులతో కలిసి సిద్దేశ్వర కోన జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతంలో స్నానం చేస్తుండగా వెంకట కళ్యాణ్ నీటిలో గల్లంతైనాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అతని కోసం గాలించారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం మరో సారి గజ ఈతగాళ్లతో జలపాతంలో గాలింపు చేపట్టగా వెంకట కళ్యాణ్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Read Previous

నెల్లూరులో యువజనోత్సవాలు : ప్రారంభించిన మంత్రి కాకాణి, జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం

Read Next

దివ్యాంగులను ప్రోత్సహిస్తే సాధారణ వ్యక్తులతో పోటీ పడతారు : మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.