బంగాళాఖాతంలో అల్పపీడనం : ఈనెల 19 నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

Clock Of Nellore ( Delhi ) – ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం మధ్యాహ్నం తర్వాత అల్పపీడనం ఏర్పడింది. అండమాన్ వద్ద అది కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఈనెల 22వ తేదీ లోగా పాండిచ్చేరి – దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీని ప్రభావంతో ఈనెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకూ దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని, 22వ తేదీ నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా మారుతుందా అనే అప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలియజేశారు. 

Read Previous

రేపే భారత తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం : షార్ నుండి గగనతలంలోకి

Read Next

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో POCUS వర్క్ షాప్ : ప్రారంభించిన డాక్టర్ శ్రీరాం సతీష్

Leave a Reply

Your email address will not be published.