34వ డివిజన్ లో ముగిసిన గడప గడపకు కార్యక్రమం : అభివృద్దే అజెండా అన్న కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 34వ డివిజన్ లో ముగిసింది. ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం ఆయన జేవిఆర్ కాలనీలో వైసీపి నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడి వారి నుండి అభిప్రాయాలు సేకరించారు. ఏ సమస్య వచ్చినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని, నేరుగా వచ్చి సమస్యలను తెలియ జేయవచ్చునని లేదంటే తనకే ఫోన్ చేయవచ్చునని ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. 34వ డివిజన్ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని, డివిజన్ ను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశం అనంతరం వైసీపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయాల సిబ్బందితో కలిసి అల్పాహార విందు చేశారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ షేక్ ఫామిద కూడా పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరుజిల్లాలో చిరుత సంచారం… మేకల మందపై దాడి

Read Next

నెల్లూరు అష్ఠ దిగ్భంధనం : భారీగా వరద నీరు, ప్రజలకు తప్పని పాట్లు

Leave a Reply

Your email address will not be published.