వైసీపి ప్రభుత్వంలో విద్యా, వైద్యానికి పెద్దపీట : ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నిరుపేదలకు కూడా నాణ్యమైన విద్య, వైద్యం అందాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయా రంగాల్లో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి నాడు – నేడు పథకం ద్వారా పాఠశాలలను, ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన 34వ డివిజన్ లోని ప్రగతి నగర్ 3వ వీధిలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులై ఉండి పథకాలు రాకుంటే వెంటనే స్థానిక సచివాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫామిద, డివిజన్ ఇంఛార్జ్ షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ప్రభుత్వ సొమ్ము నొక్కేసి బార్ ఏర్పాటు : నెల్లూరులో సీజ్ చేసిన ఏసిబి అధికారులు

Read Next

నెల్లూరు ఓవెల్ స్కూల్ లో చిన్నారిపై ఉద్యోగి లైంగిక దాడి : చితక బాదిన బంధువులు

Leave a Reply

Your email address will not be published.