Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 10వ డివిజన్ లో మాజీ మంతి, నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన ఎన్.డి.ఆర్ లే అవుట్, ఉస్మాన్ సాహెబ్ పేట, తదితర ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా నివాసాల్లోని వారికి పథకాల ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. త్వరలో పేదలకు చెత్త పన్నును రద్దు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కిన్నెర ప్రేమ్ కుమార్, వైసీపి నేతలు పాల్గొన్నారు.
