Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు బట్వాడిపాళెం సెంటర్ లోని నూరుల్ హుదా అరబిక్ కళాశాలలో ఈనెల 16, 17వ తేదీల్లో ఇస్తిమా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంభందించిన ఏర్పాట్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు. సర్వమానవాళికి మేలు చేసే ఇస్తిమా ప్రార్ధనలకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఇస్తిమాకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది ముస్లింలు హాజరవుతారని, భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రార్ధనలు నిర్వహిస్తారని, ఈ ప్రార్ధనలు సర్వమానవాళికి మేలు చేసే విధంగా ఉంటాయని కోటంరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమ విజయవంతానికి తన వంతుగా ఏది చేయాలో అన్నీ పూర్తి స్థాయిలో చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మౌలానా ముఫ్తి వహాబ్ సాహెబ్, మౌలానా ఇలియాజ్, మౌలానా రహీద్, మౌలానా అహ్మద్ పాల్గొన్నారు.
