Clock Of Nellore ( Nellore ) – నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ విద్యాలయాలను కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దుతున్నామని, విద్యార్ధులకు అవసరమైన అన్నీ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు స్టోన్ హౌస్ పేటలోని KAC కళాశాలలో 1.24 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంఖు స్థాపన చేశారు. నాడు – నేడు పథకం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారని అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. అంతకు ముందు ఆయన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి వాసవి మాతను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు మొగళ్లపల్లి కామాక్షిదేవి, కిన్నెర మాల్యాద్రి, కిన్నెర ప్రేమ్ కుమార్, కళాశాల లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
