కార్తీక మహా దీపోత్సవ వేడుకలు : ఉదయం పూజలు నిర్వహించిన ప్రముఖులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని గణేష్ ఘాట్ లో కార్తీక మహా దీపోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం ఘాట్ వద్ద పంచముఖ శివలింగాన్ని వేద పండితులు ప్రతిష్ఠించారు. పూజలు చేసి దీపోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ శివలింగం వద్ద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి ఉషమ్మ, వెంకయ్య నాయుడు కుమార్తె ఇమ్మడి దీపా వెంకట్ తదితరులు పూజలు నిర్వహించి అభిషేకం చేశారు. అనంతరం శివ పార్వతుల ఉత్సవ విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం శివ పార్వతులు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం కార్తీక దీపోత్సవ శోభాయాత్రతో పాటూ ఘాట్ వద్ద గంగా హారతి కార్యక్రమం జరగనుంది.

Read Previous

శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : ఎస్పీ విజయరావు హెచ్చరిక

Read Next

నెల్లూరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి : స్వాగతం పలికిన నేతలు, అధికారులు

Leave a Reply

Your email address will not be published.