కొనసాగుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకూ కార్యక్రమం

Clock Of Nellore ( Nellore ) – గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్విగ్నంగా కొనసాగిస్తున్నారు. ప్రతీ రోజూ ఒక్కో సచివాలయ పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తున్నారు. శనివారం 27వ డివిజన్ లోని చంద్రమౌళినగర్ లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నారంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ప్రభుత్వం పథకాలను వివరించారు. పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. ఏ అవసరమున్నా తనను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుధీర్ఘ పాదయాత్రలో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేస్తున్నారని, ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరువయ్యాయే తెలుసుకునేందుకు గడప గడపకూ వెళ్తున్నట్లు తెలియజేశారు.

Read Previous

ఘోష హాస్పిటల్ పనులు పరిశీలించిన మాజీ మంత్రి అనీల్

Read Next

నెల్లూరులో కుళ్లిన కోడి మాంసం : 300 కిలోల స్వాధీనం

Leave a Reply

Your email address will not be published.