లోన్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు : కోటి 20 లక్షలు ఫ్రీజ్

Clock Of Nellore ( Nellore ) – లోన్ యాప్స్ ద్వారా అమాయక ప్రజలను మోసగిస్తూ అధిక నగదు వసూళ్లు చేస్తున్న నలుగురు వ్యక్తులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లీసా అనే మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న లోన్ యాప్ లో సమయానికి లోన్ చెల్లించని వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్న ముగ్గురు తెలంగాణా, ఒకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిని అరెస్ట్ చేశారు. నెల్లూరు ఆదిత్య నగర్ కు చెందిన కొండ్రెడ్డి విద్యా సాగర్ రెడ్డి అనే వ్యక్తి లోన్ యాప్ ద్వారా 30వేలు లోన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ముద్దాయిలు ఫోన్లు, వాట్సాప్ ద్వారా బాధితుడు సాగర్ రెడ్డిని బెదిరించారు. తీసుకున్న దాని కంటే ఎక్కువ చెల్లించాలని లేదంటే నీ ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపిస్తామని బెదిరించడంతో 40 లక్షల వరకూ చెల్లించాడు. ఇంకా నగదు పంపాలని వేధిస్తుండటంతో బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలాజీ నగర్ పోలీసులు సైబర్ క్రైం పోలీసుల సాయంతో మనీ ట్రాన్స్ ఫర్ చేసి యుపిఐ ఐడిల ద్వారా వివరాలను తెలుసుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాకు చెందిన జాదవ్ యువరాజ్, నిర్మల్ జిల్లాకు చెందిన పవార్ అజయ్ పవన్ కళ్యాణ్, రాథోడ్ సాయికిరణ్, కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగుళూరు జిల్లాకు చెందిన అబ్దుల్ లయిక్ అనే నలుగుర్ని గుర్తించి అరెస్ట్ చేశారు. దీనిపై శనివారం జిల్లా ఎస్పీ విజయరావు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. లోన్ యాప్ లో లోన్లు తీసుకుని ప్రజలు మోసపోవద్దని సూచించారు. నిందితులకు సంభందించిన బ్యాంక్ ఖాతాల్లో ఉన్న ఒక కోటి 20 లక్షల రూపాయల నగదును ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను కోరినట్లు ఎస్పీ తెలియజేశారు.

Read Previous

తల్లిదండ్రుల హత్యకు సుపారీ ఇచ్చిన కసాయి కొడుకు : అరెస్ట్ చేసిన పోలీసులు

Read Next

నెల్లూరులో రౌడీ షీటర్ దారుణ హత్య : హతుడిపై రెండు హత్య కేసులు

Leave a Reply

Your email address will not be published.