Clock Of Nellore ( Nellore ) – పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి సుమారు వెయ్యి మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇందులో భాగంగా పోలీసు ఆయుధాలను ప్రదర్శించారు. ఆయుధాల పనితీరు, కమ్యూనికేషన్ వ్యవస్థకు సంభందించిన పరికరాల పనితీరును స్వయంగా ఎస్పీ విజయరావు విద్యార్ధులకు వివరించారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను వివరించి అందరూ మంచి ప్రవర్తనతో జీవించాలని, మంచి లక్ష్యంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్పీ కాంక్షించారు. అనంతరం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్ధఉలకు వ్యాస రచన, వకృత్వ పోటీలను నిర్వహించారు. ఈనెల 29వ తేదీనా ఉచిత వైద్య శిభిరం నిర్వహిస్తామని, 31వ తేదీనా యూనిటీ రన్ ను చేపడతామని ఈ సందర్భంగా ఎస్పీ వెల్లడించారు.
