Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజూ ఒక్కో సచివాలయం పరిధిలో ఆయన పర్యటిస్తూ ఇంటింటికి వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలను వారికి వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా బుధవారం 27వ డివిజన్ పరిధిలోని రెవెన్యూ కాలనీలో కోటంరెడ్డి గడప గడపకూ తిరిగారు. స్థానికులను ఎలా ఉన్నారంటూ పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భీమినేని మురహరి, వైసీపి నేతలు పాల్గొన్నారు.
