Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో ప్రసిద్ధ గాంచిన మూలాపేటలోని శ్రీ భువనేశ్వరీ సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవంలో భాగంగా ఆకాశ దీప కార్యక్రమం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యి పూజలు నిర్వహించి ఆకాశ దీపాన్ని వెలిగించారు. నెల రోజుల పాటూ శివాలయంలో కార్తీక మాస ఉత్సవాలను నిర్వహిస్తామని, భక్తులకు అవసరమైన అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా అనీల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మైన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆఫ్కాఫ్ ఛైర్మైన్ కొండూరు అనీల్ బాబు, కార్పొరేటర్లు నీలి రాఘవరావు, వేలూరు మహేష్, పొట్లూరి రామకృష్ణ ఆచారి, గుంజి జయలక్ష్మి, కార్పొరేషన్ కో – ఆప్షన్ సభ్యులు చాట్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
