మాది సంక్షేమ ప్రభుత్వం – గడప గడపకు కార్యక్రమంలో మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 4వ డివిజన్ లోని జాకీర్ హుస్సేన్ నగర్ లో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన రామాలయం వీధి ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలు విన్నవించగా తక్షణం వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వైసీపి అంటే సంక్షేమం అని అనీల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోలంరెడ్డి లక్ష్మీ ప్రత్యూత తదితరులు పాల్గొన్నారు.

Read Previous

కార్తీక దీపోత్సవానికి కుటుంబ సమేతంగా రండి : అర్చకులను ఆహ్వానించిన కోటంరెడ్డి

Read Next

ఇంతకీ ఎవరీ యువతి : అర్ధరాత్రి అడవిలో ఏం పని ?

Leave a Reply

Your email address will not be published.