ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ : రెండు గంటల తర్వాత పునరుద్ధరణ

Clock Of Nellore ( Buero Report ) – ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌ సర్వీసులు నిలిచిపోయాయి. సర్వర్‌ డౌన్‌ కావడంతో వాట్సాప్‌ సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యలతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెసేజ్‌ డెలివరీ స్టేటస్‌ను వాట్సాప్‌ చూపించకపోవడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు. వాట్సాప్‌లో డబుల్‌ టిక్‌ , బ్లూటిక్‌ మార్కులు చూపించడం లేదు. దీంతో యూజర్లు మేటా కంపెనీకి ఫిర్యాదులు చేస్తున్నారు. వాట్సాప్‌కు మెసేజ్‌లు రావడం లేదు.. బయట నుంచి కూడా రావడం లేదు. గతంలో కూడా వాట్సాప్‌ సర్వర్‌ పలుమార్లు డౌన్‌ అయ్యింది.

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ నెట్‌వర్క్‌ మధ్యాహ్నం 12.30 నుంచి కుప్పకూలింది. వినియోగదారులు గ్రూప్ చాట్‌లకు సందేశాలను పంపలేకపోతుండటం.. వ్యక్తులకు పంపిన సందేశాలకు ఒక టిక్ మాత్రమే చూపిస్తుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా వ్యాట్సప్ నెట్‌వర్క్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వినియోగదారులు నివేదించారు.

అయితే, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల మాతృ సంస్థ అయిన మెటా దీనిపై స్పందించింది, సేవల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే కాదు, వాట్సాప్ వెబ్, వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లు కూడా పనిచేయడం లేదు. వాట్సాప్ సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందో కూడా స్పష్టం కాకపోవడంతో గందరగోళం నెలకొంది. వాట్సప్ సర్వర్ డౌన్ కావడంతో.. సోషల్ మీడియా వినియోగదారులు ట్విట్టర్‌లో వాట్సాప్ డౌన్ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు. మధ్యాహ్నం 2. 15 గంటలకు వాట్సాప్ తిరిగి వినియోగంలోకి రావడంతో వినియోగదారులు హమ్మయ్య అనుకున్నారు.

Read Previous

సిఎం జగన్ నెల్లూరు పర్యటనకు చకచకా ఏర్పాట్లు : పర్యవేక్షించిన మంత్రి కాకాణి

Read Next

ఇవాళ సూర్య గ్రహణం… మూతబడ్డ ఆలయాలు

Leave a Reply

Your email address will not be published.