22వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం – పథకాలు వివరించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 22వ డివిజన్ లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం భక్తవత్సల నగర్ లోని రాజు కాంప్లెక్స్, సీతారాముల దేవస్థానం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హత కలిగి పథకాలు అందకపోతే తనకు చెప్పాలని కోరారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీసి గడువులోగా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.

Read Previous

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రాణాలకు భరోసా : డిఎస్పీ అబ్ధుల్ సుబహాన్

Read Next

ఈనెల 27న నెల్లూరుకు సిఎం జగన్ రాక : జెన్ కో 3వ యూనిట్ ప్రారంభోత్సవం

Leave a Reply

Your email address will not be published.