సమస్యలు వింటూ… నమోదు చేసుకుంటూ… ముందుకెళుతూ… గడప గడపలో కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్విగ్నంగా కొనసాగిస్తున్నారు. ఒక్క గడప కూడా వదల కుండా ప్రతీ గడపకూ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వుతో వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అర్హులైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను పేపర్ పై నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. గడప గడపకు వెళ్తున్న కోటంరెడ్డికి ప్రజలు తమ ఆశీస్సులు అందిస్తున్నారు. ఆదివారం 22 వ డివిజన్ భక్తవత్సల నగర్ లోని స్నేహ నగర్ లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని గడువులోగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏ అవసరమొచ్చినా తనకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మూలే విజయ భాస్కర్ రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.

Read Previous

వైసీపి గర్జన విఫలంతోనే జనసేన నేతల అరెస్ట్ : కేతంరెడ్డి ఆరోపణ

Read Next

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రాణాలకు భరోసా : డిఎస్పీ అబ్ధుల్ సుబహాన్

Leave a Reply

Your email address will not be published.