Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఇప్పటికే ఉన్న గణేష్ నిమజ్జన ఘాట్ మరింత అభివృద్ధి కానుంది. పర్యాటక కేంద్రంగా మారనుంది. 15.20 కోట్ల రూపాయలతో శనివారం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. దీనికి సంభందించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శంఖుస్థాపన శిలాఫలకాన్ని కోటంరెడ్డి ఆవిష్కరించారు. ఘాట్ అభివృద్ధికి సంభందించి పలువురి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలిపారు. నెల్లూరులో మంచి పర్యాటక, ఆథ్యాత్మిక కేంద్రంగా గణేష్ నిమజ్జన ఘాట్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఘాట్ ప్రదేశాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక మంది ప్రయత్నం చేశారని, అయితే తనకు అవకాశం వచ్చినందుకు అదృష్ఠంగా భావిస్తున్నట్లు కోటంరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ స్రవంతి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, విజయడైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, నేతలు మిద్దె మురళీ కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
