ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు… ఏపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ?

Clock Of Nellore ( Amaravathi ) – ఏపీ ప్రజలకు అలెర్ట్. పెను ఉపద్రవం రాబోతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. తుఫాన్ హెచ్చరిక వచ్చింది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళంఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ అల్పపీడనం బయపడి తీవ్ర వాయుగుండంగా మారి.. ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయిగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ. తుఫాన్ ఏర్పడితే దానికి సిత్రాంగ్‌గా నామకరణం చేయాలని నిర్ణయించారు. ఈ తుఫాన్ ఏర్పడితే ఏపీ, ఒరిస్సా, బెంగాల్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.

Read Previous

నెల్లూరులో గణేష్ నిమజ్జన ఘాట్ అభివృద్ధికి శ్రీకారం : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

సివిల్ సప్లై కుంభకోణంలో జిల్లా మంత్రి హస్తం : ఆరోపించిన సోమిరెడ్డి

Leave a Reply

Your email address will not be published.