కార్యకర్తలతో కోటంరెడ్డి ఆత్మీయ సమావేశం : నేనున్నానంటూ భరోసా

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపి నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెల్లూరు 25వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేసుకుని 22వ డివిజన్ లోని అడుగుపెడుతున్న సందర్భంలో గురువారం బుజబుజ నెల్లూరులో ఈ సమావేశాన్ని నిర్వహించారు. 25వ డివిజన్ కు చెందిన నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బుజబుజ నెల్లూరు ప్రాంతం శివారు కావడంతో నూతనంగా పలు కాలనీలు ఏర్పాటవుతున్నాయని, ఆయా ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏ సమస్య వచ్చినా తాను కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, ఎప్పుడైనా ఫోన్ చేసినా స్పందిస్తానని కోటంరెడ్డి పేర్కొన్నారు. సమావేశం అనంతరం నేతలు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బందితో కలిసి అల్పాహార విందు చేశారు. ఈ సమావేశంలో 25వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహ గిరి కూడా పాల్గొన్నారు.

Read Previous

వ్యాపారస్తులకు అండగా ఉంటా : భరోసా ఇచ్చిన మాజీ మంత్రి అనీల్

Read Next

150 రోజుల మైలురాయిని చేరుకున్న పవనన్న ప్రజాబాట…

Leave a Reply

Your email address will not be published.