25వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం : సమస్యలు విన్న కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్త్రృతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం 25వ డివిజన్ బుజబుజ నెల్లూరులోని రామ్ నగర్ లో పర్యటించారు. నగర మేయర్ స్రవంతితో కలిసి ఇంటింటికి వెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ఒక వేళ అందకపోతే ఎందుకు అందలేదని ఆరా తీస్తున్నారు. అలాగే స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బద్దెపూడి నరసింహ గిరి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరును ఫ్లెక్సీ ఫ్రీ నగరంగా మార్చండి : కమిషనర్ ఆదేశాలు

Read Next

ఈనెల 9న దర్గాలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన : ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.