Clock Of Nellore ( Nellore ) – గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆగస్టు 9వ తేదీ నుండి వివిధ ఆథ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో తీరిక లేకుండా గడపడంతో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. ఆగస్టు 9వ తేదీ నుండి బారాషాహిద్ దర్గాలో జరిగిన రొట్టెల పండుగ, అదే నెల 16వ తేదీ నుండి ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన శ్రీవారి వైభోత్సవాలు, వినాయక చవితి సందర్భంగా శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లకు ఘాట్ నిర్మాణం, గతంలో ఎప్పుడూ లేని విధంగా నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేయించారు. దాని తర్వాత దర్గామిట్టలోని ప్రసిద్ధి గాంచిన శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలను కోటంరెడ్డి ఘనంగా జరిపించారు. ఆయన కూడా భవానీ మాలను ధరించి అమ్మవారి సేవలో తరించారు. ఈ నాలుగు ముఖ్యమైన కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే జరగడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమాల నేపద్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు.

తాజాగా దసరాతో నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో గడప గడపకు కార్యక్రమంపై దృష్ఠి సారించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండానే గురువారం నుండే గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 105 రోజుల పాటూ ఈ కార్యక్రమం విరామం లేకుండా సాగనుండి. రోజుకు ఒక సచివాలయ ప్రాంతంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. 105 రోజుల్లో మొత్తం 16 డివిజన్ల పరిధిలోని 105 సచివాలయ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ వరకూ నాన్ స్టాప్ గా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తిరిగి ప్రారంభమైన ఇవాళ 25వ డివిజన్ బుజబుజ నెల్లూరు పరిధిలోని గొల్లపాళెం రామాలయం వీధి ప్రాంతంలో కోటంరెడ్డి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన కోటంరెడ్డి మిగిలిన వాటిని నిర్ధేశించిన సమయం లోగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.
