నెల్లూరులో మరో మెగా ప్రాజెక్ట్ : శంఖుస్థాపన చేసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ తీవ్ర మవుతున్న దృష్ఠ్యా దానికి అనుగుణంగా పెన్నానదిపై వాహనాల రాకపోకలకు మరో వంతెన నిర్మాణం కావల్సిన ఆవశ్యకతను దృష్ఠిలో ఉంచుకుని దానికి 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు. ప్రస్తుతం బ్రిటీష్ హయాంలో నిర్మాణం అయిన వంతెన ద్వారానే నెల్లూరుసిటీలోంచి వెంకటేశ్వరపురం వైపు అన్నీ వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. నూతన వంతెనకు అనుమతులు మంజూరయ్యి, నిధులు విడుదల కావడంతో ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ నిర్మాణ పనులపై దృష్ఠి సారించారు.

నగరంలోని పాత చెక్ పోస్టు వద్ద వంతెన నిర్మాణానికి విజయదశమి రోజున ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నగరంలో దాదాపు 600 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. 100 కోట్లతో పెన్నాపై నూతన వంతెన, మరో 100 కోట్లతో పెన్నానది కరకట్ట పనులు, 200 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ కాలువ పనులు మంజూరు చేయించినట్లు వివరించారు. 18 నెలల్లో వంతెన పనులు పూర్తి చేస్తామని అనీల్ కుమార్ యాదవ్ తెలియజేశారు. నెల్లూరు నగరంలో అభివృద్ద్యే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Read Previous

ముగిసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నెల్లూరు పర్యటన

Read Next

142వ రోజు : జోరువానలోనూ పవనన్న ప్రజాబాట

Leave a Reply

Your email address will not be published.