Clock Of Nellore ( Pondicherry ) – నెల్లూరుజిల్లా కృష్ణపట్నంకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొప్పోలు నాగభూషణం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. పాండిచ్చేరికి చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటీ శనివారం ఆయనకు పాండిచ్చేరిలో జరిగిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు గానూ డాక్టరేట్ అందజేసినట్లు ఈ సందర్భంగా నాగభూషణం తెలిపారు. శనివారం పాండిచ్చేరిలోని కంబన్ కళయ్ రంగం ఆడిటోరియంలో యూనివర్శిటీ స్నాతకోత్సవం జరిగింది. ఈ స్నాతకోత్సవంలో యూనివర్శిటీ వైస్- ఛాన్సలర్ నుండి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. డాక్టరేట్ ను అందుకున్న కొప్పోలు నాగభూషణంకు పలువురు జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలియజేశారు.
