Clock Of Nellore ( Nellore ) – యజమానికి మస్కా కొట్టి 28 లక్షలతో ఉడాయించిన ఓ వ్యక్తిని గంటల వ్యవధిలోనే నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని నగదును రికవరీ చేశారు. కర్నాటక నుండి నాగాలాండ్ కు సీమ పందులను ఎగుమతి చేసి వాటిని అమ్మగా వచ్చిన 28 లక్షలతో లారీ డ్రైవర్ కృష్ణన్ నెల్లూరు మీదుగా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ వచ్చాడు. అయితే అతని వద్ద ఉన్న డబ్బుపై ఆశ పెంచుకున్న డ్రైవర్ కృష్ణన్ ఎలాగైనా ఆ డబ్బును సొంతం చేసుకోవాలని పథకం వేశాడు. తమిళనాడులో ఉండే తన బావమరిది మహాలింగం వేలుకు సమాచారం ఇచ్చి నగదును దోచుకెళ్లినట్లు నాటకం ఆడి డబ్బుతో ఉడాయించాలని పథకాన్ని వివరించారు. ఇదే క్రమంలో గత రాత్రి మనుబోలు మండలం, కొండూరు సత్రం వద్ద డ్రైవర్ కృష్ణణ్ లారీని ఆపి ఉండిగా అతని బావ మరిది వేలు అక్కడకు వచ్చి 28లక్షల నగదుతో ఉడాయించాడు. తర్వాత డ్రైవర్ కూడా పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న యజమాని మనబోలు పోలీసులకు సమాచారం అందించగా తక్షణం స్పందించిన పోలీసులు నైట్ బీట్, పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. టోల్ ప్లాజాల వద్ద పోలీసులను మోహరింపజేశారు. అప్పటికప్పుడు పోలీసు టీంలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలను ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మంగళవారం నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ విజయరావు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. డ్రైవర్ తో పాటూ అతని బావమరిది ఇద్దరిదీ తమిళనాడు రాష్ట్రం అని చెప్పారు. చోరీ విషయం తెలియగానే తమిళనాడుకు కూడా పోలీసు బృందాలను పంపామని వివరించారు. మనుబోలు ఎస్సైను అభినందించారు. చోరీ సొత్తులో 99 శాతం నగదు రికవరీ చేశామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో క్రైం విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి, అడ్మిన్ అదనపు ఎస్పీ హిమవతి తదితరులు పాల్గొన్నారు.
