చిల్డ్రన్స్ పార్కు ప్రాంత అభివృద్ధికి కృషి : వెల్లడించిన మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని, ఆ ప్రాంతాన్ని అంకా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. పార్కు రోడ్డులోని జగదీష్ నగర్ 7వ వీధిలో 40 లక్షలతో నిర్మించనున్న సిమెంటు రోడ్డుకు ఆయన శంఖు స్థాపన చేశారు. అనంతరం అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ పార్కు ప్రాంతాన్ని ఇప్పటికే అభివృద్ధి చేశామని, భవిష్యత్తును దృష్ఠిలో ఉంచుకుని ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన రహదారిని మరింత వెడల్పు చేస్తామన్నారు. అలాగే నేరాల నియంత్రణ, భద్రత దృష్ఠ్యా నెల్లూరు నగర నియోజకవర్గంలోని అన్నీ ప్రాధన కూడళ్లలో స్థానికులు సహకారంతో సిసి కెమరాలు ఏర్పాటు చేయిస్తానని అనీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, ఇతర డివిజన్లి కార్పొరేటర్లు ఊటుకూరు నాగార్జున, నీలి రాఘవ రావు, కిన్నెర ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో అంగరంగ వైభవంగా అష్టాదశ శక్తి పీఠాల శోభాయాత్ర…

Read Next

కోటి వ్యయంతో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ : ప్రారంభించిన మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.