Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని మైపాడు రోడ్డును 4 లైన్ల రహదారిగా విస్తరిస్తున్నామని ఆ పనులకు సంక్రాంతి పండుగ తర్వాత శంఖుస్థాపన చేయనున్నామని మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ చెప్పారు. 100 కోట్ల రూపాయలతో జరుగుతున్న జాఫర్ సాహెబ్ కెనాల్ రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే బోడిగాడితోట ప్రాంతంలో 80 లక్షలతో నిర్మిస్తున్న అర్భన్ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశారు. అనంతరం అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో జాఫర్ సాహెబ్ కెనాల్ ను ఆధునీకరిస్తున్నామని, అలాగే మరో 100 కోట్ల రూపాయలతో మైపాడు రహదారిని నాలుగు వరసల రోడ్డుగా విస్తరించబోతున్నామన్నారు. సంక్రాంతి తర్వాత ఆ పనులకు శంఖుస్థాపన చేస్తామన్నారు. ఇవే కాకుండా పెన్నానదిలో మరో వంతెన నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, కిన్నెర మాల్యాద్రి, వైసీపి నేతలు పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, మద్దినేని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
