బిట్రగుంట రైల్వేస్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం .​.. భార్య విడిచి వెళ్లిందని..

Clock Of Nellore ( Bitragunta ) – నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్​లో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. విద్యుత్​ తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. కండీర్ (34) కేరళ నుంచి ఝార్ఖండ్​కు వెళ్తున్నాడు. కానీ తను వెళ్లాల్సిన గమ్యం రాకముందే.. బిట్రగుంట రైల్వే స్టేషన్​లో దిగాడు. ఆత్మహత్య చేసుకుంటానని కొద్దిసేపు హంగామా చేశాడు. ఎంతమంది ఆపినా వినకుండా… విద్యుత్​ స్తంభం ఎక్కి కరెంట్​ తీగలను పట్టుకున్నాడు. అంతే షాక్​ తగిలి కిందపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఘటనాస్థలానికి చేరుకుని 108 వాహనంలో కావలి వైద్యశాలకు తరలించారు. కండీర్​ది ఝార్ఖండ్ రాష్ట్రంగా రైల్వే పోలీసులు పేర్కొన్నారు. భార్యతో గొడవపడటంతో.. ఆమె అతడిని విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మనస్థాపంతో కండీర్​ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరో వైపు నిన్న ఇద్దరు చిన్నారులు గూడూరు రైల్వే స్టేషన్ లో తప్పిపోయి ఉండగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు చిన్నారులు కండీర్ పిల్లలుగా తేల్చారు.

Read Previous

ఫిజియోథెరపి ద్వారా త్వరగా కోలుకోవచ్చు : సదస్సులో డాక్టర్ గణేష్ వెల్లడి

Read Next

మెడికవర్ లో వెయ్యి దాటిన క్యాన్సర్ PET CT స్కాన్స్…

Leave a Reply

Your email address will not be published.