Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో పెన్నానదిపై నూతనంగా నిర్మించిన బ్యారేజీ కమ్ బ్రిడ్జిని మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సంగం బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం హెలికాప్టర్ లో కోవూరు షుగర్ ప్యాక్టరీ వద్దకు చేరుకున్న సిఎం జగన్ అక్కడి నుండి వాహనంలో బ్యారేజీ పై నుండి రంగనాయకుల పేట వైపుకు చేరుకున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్, నగర మేయర్ స్రవంతితో కలిసి పెన్నానదికి పూజలు నిర్వహించారు. అనంతరం బటన్ నొక్కి బ్యారేజీని జాతికి అంకితం చేశారు. అనంతరం బ్యారేజీ పక్కన ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుండి తిరిగి హెలికాప్టర్ లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో గన్నవరం తిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వైసీపి నేతలు పాల్గొన్నారు.
