కాపువీధిలో ఘనంగా వినాయక చవితి – పూజలు నిర్వహించిన ఆనం సోదరులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు కాపువీధి సెంటర్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆనం కుటుంబసభ్యులు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆనం సోదరులు ఆనం రామ నారాయణరెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. విఘ్నాలను తొలగించే గణనాథుడు రాష్ట్రానికి అంతా మేలు చేకూరే విధంగా దీవించాలని ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం రంగమయూర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి కుమారుడు శుభకర్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి కుమారుడు కార్తికేయ రెడ్డి పాల్గొన్నారు.

Read Previous

టిడిపి కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు – పూజలు చేసిన అజీజ్

Read Next

పవన్ సిఎం అయితే ప్రతి రోజూ పండగే… చవితి రోజు కూడా ప్రజల్లోనే కేతంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.