జనసేన అధికారంలోకొస్తే రోడ్ల కనెక్టివిటీని పెంచుతాం : కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – జనసేన పార్టీ అధికారంలోకొస్తే నెల్లూరు సిటీ నుండి జాతీయ రహదారికి కనెక్టివిటీ రోడ్ల సంఖ్యను పెంచుతామని ఆపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పేర్కొన్నారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా మంగళవారం ఆయన 13వ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్, బ్యాంక్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ బాలాజీనగర్ లోని బ్యాంకు కాలనీలో అంతర్గత రోడ్లు ఇంకా అవసరమన్నారు. అంతే కాకుండా బాలాజీనగర్ ప్రాంతం నుండి జాతీయ రహదారికి కనెక్టివిటీ రోడ్లు తక్కువగా ఉన్నాయని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అంతర్గత రోడ్లతో పాటూ హైవే కనెక్టివిటీ రోడ్లను పెంచుతామని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనసేన పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

 

Read Previous

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

Read Next

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన చవితి వేడుకలు – పూజల్లో ఎమ్మెల్యేలు

Leave a Reply

Your email address will not be published.