Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తన వద్దకు వస్తే అప్పటికప్పుడే పరిష్కరిస్తానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం సాయంత్రం 51వ డివిజన్ లోని సుబేదారుపేట ప్రాంతంలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి వివరించారు. స్థానికులు చెప్పిన కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఏ సమస్య ఉన్న తనకు తెలపాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ కాయల సాహిత్య తదితరులు పాల్గొన్నారు.
