నవ రత్నాలు అందుతున్నాయా ? – ప్రజలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాలను చుట్టేస్తున్నారు. గడప గడపకూ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరాతీస్తున్నారు. అర్హత కలిగి పథకాలు అందకుంటే అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒక్క రోజు కూడా విరామం లేకుండా ప్రతీ రోజూ ఏదో ప్రాంతంలో పర్యటిస్తున్నారు. తాజాగా శుక్రవారం 31వ డివిజన్ అంబాపురంలోని అరుంధతీ వాడలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు పలకరించారు. ఎలా ఉన్నారంటూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా తనకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బత్తల మంజుల పాల్గొన్నారు.

Read Previous

పవనన్న ప్రజాబాటకు 100 రోజులు : నెల్లూరులో ర్యాలీ చేపట్టిన కేతంరెడ్డి

Read Next

గణేష్ విగ్రహాల ఏర్పాటు అనుమతులకు సింగిల్ విండో సిస్టం : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.