జెండా ఎగురవేసి జాతి ఔన్నత్యాన్ని చాటుదాం – పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులయ్యి జాతి ఔన్నత్యాన్ని చాటే విధంగా ప్రతీ ఒక్కరూ జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పిలుపునిచ్చారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా 90వ రోజైన ఆదివారం ఆయన నెల్లూరు 51వ డివిజన్ పరిధిలోని ఏబిఎం కాంపౌండ్ ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రజలంతా వారి వారి నివాసాలపై మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురువేయాలని సూచించారు.

 

Read Previous

ఈనెల 16 నుండి నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు : ఏర్పాట్ల పరిశీలన

Read Next

సమరయోధుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్, అధికారుల సన్మానం

Leave a Reply

Your email address will not be published.