స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు : పోలీస్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ చక్రధర్ బాబు, రెవెన్యూ, పోలీసు, కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ తో కలసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసే ప్రముఖులు ప్రత్యేకంగా కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రౌండ్‌ అంతా పరిశుభ్రంగా సిద్ధం చేయాలన్నారు. మార్చ్ ఫాస్ట్‌, శకటాల ప్రదర్శన నిర్వహణకు ట్రాక్‌ సిద్ధం చేయాలన్నారు. ప్రజలు వేడుకలను వీక్షించే విధంగా అవసరమైన షామియానాలు, త్రాగునీటి వసతి ఏర్పాటు చేయించాలన్నారు. అక్కడ జరుగుతున్న వేదిక ఏర్పాట్లు పరిశీలించారు. ప్రభుత్వ శాఖల ప్రగతిని ప్రదర్శిస్తూ ఏర్పాటు చేస్తున్న శకటాల వివరాలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ హరితను ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలను దేశ భక్తిని పెంపొందించే విధంగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ హరిత, ఏఆర్ అడిషనల్ ఎస్.పి శ్రీనివాస రావు, ఆర్డీవో మలోల, డిఆర్డిఏ, డ్వామా పిడి లు సాంబశివా రెడ్డి, వెంకట్రావు, జడ్పి సి.ఈ.ఓ వాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, ఐటిడిఏ పిఒ మందా రాణి, ఐసిడిఎస్ పిడి ఉమామహేశ్వరి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సుధాకర్ రాజు, జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ బాబు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాదికారి కనక దుర్గ భవాని, రూరల్ మండల తహసిల్దార్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Previous

జగన్ శాశ్వత సిఎంగా ఉండాలంటూ రొట్టెను అందుకున్న మంత్రి కాకాణి

Read Next

కోవూరులో విషాదం : అపార్ట్ మెంట్ నుండి దూకి బాలిక ఆత్మహత్య

Leave a Reply

Your email address will not be published.