Clock Of Nellore ( Kovur ) – నెల్లూరుజిల్లా కోవూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక తాము నివాసం ఉండే అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు నగరానికి చెందిన ఆ బాలిక కుటుంబం ప్రస్తుతం కోవూరులో ఉంటోంది. బాలిక స్థానిక పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తుంది. ఈ క్రమంలో ఏమైందో ఏమో ఇవాళ అపార్ట్ మెంట్ పై నుండి కిందికి దూకింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ యువకుడి వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలినట్లు తెలిసింది.
